ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా, మున్సిపల్ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శరత్ మాక్స్ విజన్ కంటి ఆసుపత్రి సహకారంతో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, శస్త్రచికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.