వైసీపీ నుంచి టీడీపీలో భారీ చేరుకలు.!
ప్రకాశం: గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. బేస్తవారిపేట(M) జేసీ అగ్రహారం వైసీపీ సర్పంచ్ మేకల రమణయ్య, వారి అనుచరులు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.