కలెక్టరేట్‌లో జెండా ఎగరవేసిన విశాఖ జేసీ

కలెక్టరేట్‌లో జెండా ఎగరవేసిన విశాఖ జేసీ

VSP: విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి. జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం జాతీయ నాయకులు వేషధారణలో వచ్చిన చిన్నారులతో జేసీ ముచ్చటించారు. జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.