2028 ఒలింపిక్స్‌కు ముందే భారత్‌కు షాక్..!

2028 ఒలింపిక్స్‌కు ముందే భారత్‌కు షాక్..!

భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు భారీ షాక్ తగిలింది. 2028-లాస్ ఏంజిల్స్‌ ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆమె పోటీపడనున్న 49 కిలోల విభాగాన్ని తొలిగించారు. దీంతో ఆమె శరీర బరువును పెంచి.. 53 కిలోల విభాగంలో పోటీపడాల్సి ఉంటుంది. గతంలో ఆమె 2021-టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో 49 కిలోల కేటగిరీలో రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.