ఎమ్మెల్యే ఆనందరావు నేటి పర్యటన వివరాలు

కోనసీమ: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇవాళ్టి పర్యటన వివరాలను ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 11 గంటలకు అమలాపురం పట్టణం వడ్డిగూడెంలో విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.