లబ్ధిదారులకు CMRF చెక్కులను అందజేసిన మంత్రి

ELR: ముసునూరు మండలంలోని 135 మంది పేదలకు వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.83.25 లక్షలకు సంబంధించిన చెక్కులను ఆదివారం రాష్ట్ర గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లబ్ధిదారులకు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలన్నారు.