చెరువులో జారిపడి వ్యక్తి మృతి

శ్రీకాకుళం: టెక్కలి మండలం రామనగరం గ్రామానికి చెందిన బీ.రామన్న(37) అనే వ్యక్తి శుక్రవారం గ్రామంలోని చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి మునిగిపోయి మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలు మేరకు.. శుక్రవారం చెరువులోకి దిగిన రామన్న ఒక్కసారిగా జారిపోవడంతో మృతిచెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.