రక్షణ రంగంలో భారత్, ఫిజి కీలక నిర్ణయం

భారత్, ఫిజి దేశాలు రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఓ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశాయి. రక్షణ, భద్రత రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. గ్లోబల్ సౌత్ దేశాల స్వాతంత్య్రాన్ని గౌరవించే ప్రపంచ వ్యవస్థను నిర్మించడంలో తాము భాగస్వాములం అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ చర్య ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.