రైతులకు కాంప్లెక్స్ ఎరువుల పంపిణీ

రైతులకు కాంప్లెక్స్ ఎరువుల పంపిణీ

GNTR: తెనాలి మండలం గుడివాడలోని సహకార పరపతి సంఘం వద్ద రైతులకు కాంప్లెక్స్ ఎరువులను పంపిణీ చేశారు. తహసీల్దార్ గోపాలకృష్ణతో పాటు గ్రామ సర్పంచ్ యడ్లపాటి రాకేశ్ పాల్గొని గ్రామంలోని రైతులకు ఎరువుల బస్తాలను అందజేశారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయించే ఏర్పాట్లు చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సామబిరెడ్డి తెలిపారు.