'గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి'
RR: చేవెళ్ల నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలకు తక్షణమే సొంత భవనాలు నిర్మించాలని మున్సిపల్ అధ్యక్షులు అనంతరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అద్దె భవనాల్లో కనీస విద్యా, వసతి సౌకర్యాలు లేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గురుకులాల అభివృద్ధిపై ప్రభుత్వం స్పందించి సొంత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.