హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఆదేశాలు

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంగళవారం కలిశారు. మన్నెవారిపల్లి వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం అవసరమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు.