సామూహిక వరలక్ష్మీ వ్రతం వేడుకలు..

సామూహిక వరలక్ష్మీ వ్రతం వేడుకలు..

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ధర్మ జాగరణ సమితి, వరంగల్ విభాగ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది మహిళలు పాల్గొని వరలక్ష్మి వ్రతం, కుంకుమార్చన, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పూజ అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు, పసుపు, కుంకుమను మహిళలకు అందించారు.