ఘనంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలు

VZM: గజపతినగరంలోని వైసీపీ కార్యాలయం ఆవరణలో బుధవారం ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కేకును కట్ చేసి పంపిణీ చేశారు. జడ్పీటీసీ గార తవుడు, బెల్లాను త్రినాధరావు కర్రి రామునాయుడు, నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.