ఫలించిన చర్చలు.. పత్తి కొనుగోళ్లు ప్రారంభం

ఫలించిన చర్చలు.. పత్తి కొనుగోళ్లు ప్రారంభం

TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై జిన్నింగ్‌ మిల్లులు, కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. CCI తీసుకొచ్చిన కొన్ని నిబంధనలను రాష్ట్రంలోని జిన్నింగ్‌ మిల్లులు వ్యతిరేకించడంతో ఇటీవల కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీసీఐ, జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాలతో పలు దఫాలుగా జరిపిన చర్చలు ఫలించాయి.