ప్రజల ఆకాంక్ష నెరవేరింది

ప్రజల ఆకాంక్ష నెరవేరింది

కోనసీమ: మండపేట నియోజకవర్గం తూ.గో జిల్లాలో కలపడంతో ఇక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేరినట్లు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అద్యక్షులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి అన్నారు. శనివారం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును కలిసి అభినందించారు. పలువురు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి కి చేరుకుని ఆయన్ను పూలమాలలతో ముంచెత్తారు. దీంతో అక్కడ సందడి వాతావరణం ఏర్పడింది.