ఆలయ 63వ వార్షికోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ

ఆలయ 63వ వార్షికోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ

జగిత్యాలలోని శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఆలయంలో ఈనెల 20 నుంచి 23 వరకు జరగనున్న 63వ వార్షికోత్సవం సందర్భంగా జగిత్యాల ఆర్డీవో పులి మధుసూదన్ మంగళవారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆలయంలో ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు గాజుల రాజేందర్, నాగమల్ల మనోహర్, గాజోజి రాజగోపాల్ చారి, రేపల్లె హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.