సర్పంచ్ ఎన్నికల కోసమే మహిళలకు చీరలు: ఎంపీ
MBNR: సర్పంచ్ ఎన్నికల కోసమే మహిళలకు రూ. 300 ముతక చీరలు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ సెటైర్లు వేసారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దమ్ముంటే పాలమూరు జిల్లాలో రోడ్లు బాగు చేయాలని సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలకు దిక్కులేక కేంద్రం నిధుల కోసం కాంగ్రెస్ కక్కుర్తి పడుతున్నారన్నారు.