'విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి'

'విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి'

SRD: విద్యార్థులకు చట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు కళాశాలలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.