మద్యం మత్తులో స్కూటరిస్ట్ ప్రమాదం
కడప జిల్లా బద్వేలులో HP పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం సేవించి స్కూటర్ నడుపుతున్న వ్యక్తి కింద పడిపోయాడు. తెల్లవారుజాము నుంచే మద్యం దుకాణాలు తెరవడంతో మందుబాబులు బారులు తీరుతున్నారు. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.