కొయ్యూరు మండలంలో దట్టంగా కురుస్తున్న పొగమంచు
ASR: కొయ్యూరు మండలంలో మంగళవారం పొగమంచు దట్టంగా కురుస్తోంది. మంచు బిందువుల ఉధృతి తేలికపాటి వర్షాన్ని తలపిస్తూ, చిరు జల్లుల్లా పడుతున్నాయి. పొగమంచు అందాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, గత నాలుగు రోజుల నుంచి మండలంలో భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం పూట మంచు పడుతోంది. అలాగే మధ్యాహ్నం పూట తీవ్రమైన ఎండ దంచి కొడుతోంది. సాయంత్రం పూట వర్షం కురుస్తోంది.