VIDEO: ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
పెద్దపల్లి మండలంలోని నిట్టూరులో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ఆకుల సువర్ణ శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు డప్పు చప్పుళ్ల మధ్య బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారుల నృత్యాలు, పంబాల పూజారుల విన్యాసాలు గ్రామస్థులను అలరించాయి. గౌడ కులస్థులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.