ఆ లిస్ట్ మేమే బయటపెడతాం: జగదీష్ రెడ్డి
TG: తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 400 మంది ఇన్వెస్టర్లు, 40 మంది రేవంత్ కుటుంబ సభ్యుల కోసం 4 కోట్ల మంది ప్రజలను ముంచుతున్నారని ఆరోపించారు. HILT పాలసీ కింద భూములు ఎవరికి ఇచ్చారో ఆ లిస్టు వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే కొద్ది రోజుల్లో తామే ఆ చిట్టా విప్పుతామని హెచ్చరించారు.