JNTUలో 5 నెలలుగా పని చేయని లిఫ్ట్

HYD: గడిచిన 5 నెలల నుంచి JNTUలోని పరిపాలన భవనంలో లిఫ్టు పనిచేయడం లేదు. విద్యార్థులు, అనుబంధ కళాశాల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా.. అన్యువల్ మెయింటెనెన్స్‌కి సంబంధించి ఒప్పందం లేకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తాయని చెప్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.