'అధికారులు సమన్వయంతో పని చేయాలి'
VKB: నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్డీవో అనిత, ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, MGNREGS పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.