VIDEO: యూరియా కోసం రైతుల తిప్పలు

CTR: పలమనేరు నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం బుధవారం స్థానిక రైతు భరోసా కేంద్రం వద్ద వారు ఉదయం 7 నుంచే బారులు తీరారు. తీరా అధికారులు యూరియా లేదని చెప్పడంతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం నియోజకవర్గంలో రైతులు పెద్ద ఎత్తున వరి నాటుతుండటంతో యూరియా అవసరం ఏర్పడింది.