జోరుగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు

జోరుగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు

MBNR: నవాబుపేట మండలంలోని క్వారీ వద్ద కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ దందా జోరుగా సాగుతుందని చెబుతున్నారు. నీటి కాలువల పక్కన తవ్వకాలు జరిపి మట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. వెంటనే మైనింగ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు స్పందించి చర్యలు తీసుకుని ప్రకృతిని కాపాడాలని వారు కోరారు.