VIDEO: విఘ్నేశ్వరుని ఆలయం వద్ద భక్తుల సందడి
కోనసీమ: అయినవిల్లిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోమశాల అంతా భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. అన్నదాన భవనం వద్ద కూడా రద్దీగా ఉండడంతో భక్తులు క్యూలో వేచి ఉన్నారు.