పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం

RR: గణేష్ ఉత్సవాలు, పినాతుల్ నబి పండుగలు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో షాద్ నగర్ పట్టణంలో శాంతిభద్రతలు సమన్వయంపై పీస్ కమిటీ సమావేశాన్ని పోలీసు అధికారుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.