VIDEO: భక్తి గీతాలతో ఆకట్టుకున్న మాజీ ఎమ్మెల్యే
RR: చిన్నారుల భజనలు, భక్తుల కోలాటాలు, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు స్వయంగా ఆలపించిన భక్తి గీతాలతో ఫరూఖ్ నగర్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సందడి నెలకొంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా చిన్నారులు తమ భజనలతో అలరించారు. వాయిద్యాల మధ్య మాజీ ఎమ్మెల్యే భక్తి గీతాలు ఆలపించి భక్తులను ఆకట్టుకున్నారు.