రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
కోనసీమ: రాజోలు మండలంలోని పొన్నమండ, కాట్రేనిపాడు, కూనవరం, ములికిపల్లి, చింతలపల్లి తదితర గ్రామాలకు రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అమలాపురం ఈఈ రాంబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పొన్నమండ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని వర్క్ చేయడం జరుగుతుందన్నారు.