రూ.కోట్ల ఆదాయం.. వసతులు శూన్యం

రూ.కోట్ల ఆదాయం.. వసతులు శూన్యం

కృష్ణా: బాపులపాడు (M) కానుమోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దశాబ్దాలుగా శాశ్వత భవనం లేక అద్దె భవనంలో కొనసాగుతోంది. ప్రభుత్వానికి ఏటా రూ.కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే ఈ కార్యాలయానికి దాతలు ఉచితంగా స్థలం ఇచ్చినా, గతంలో నిధులు మంజూరైనా నిర్మాణం ముందుకు సాగలేదు. ప్రస్తుతం అద్దె భవనంలోనే సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, ప్రజలు కూర్చునే చోటు లేక అవస్థలు పడుతున్నారు.