కన్నుల పండువగా ఏడుపాయల మహా జాతర

కన్నుల పండువగా ఏడుపాయల మహా జాతర

SRD: ఏడుపాయల మహా జాతరలో భాగంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా నెత్తిన బోనం, శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతర ప్రాంగణంలో ఎడ్ల బండ్ల ప్రదర్శన హైలెట్. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో వచ్చిన భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు.