చంద్రబాబు బంధువును పరామర్శించిన నాని

తిరుపతి: చంద్రగిరి మండలం నారావారిపల్లెలో గ్రామానికి చెందిన చంద్రబాబు నాయుడు బంధువు, టీడీపి నాయకుడు చిన్నబ్బ నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మండల నాయకులతో కలసి చిన్నబ్బ నాయుడుని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.