గతం కంటే అధికంగా యూరియా

గతం కంటే అధికంగా యూరియా

PDPL: గత సంవత్సరం కంటే 6వేల మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా రైతులకు సరఫరా చేశామని PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. వానాకాలం పంటకు అవసరమైన 28వేల మెట్రిక్ టన్నుల్లో ఇప్పటివరకు 19వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ జరిగిందని ప్రస్తుతం 2,500 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉందని చెప్పారు. రైతులు ముందస్తుగా నిల్వ చేసుకోకుండా అవసరం  ఉన్నంత తీసుకోవాలని తెలిపారు.