'పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి'

SDPT: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఎస్సై సౌజన్య, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్‌లు గురువారం సూచించారు. బెజ్జంకి మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణకు కోసం ఏఐఎస్ఎఫ్ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు సంగెం మధు ఆధ్వర్యంలో మొక్కలను నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎడ్లబండి చౌరస్తా వెనుక డివైడర్ మధ్యలో ఆకర్షణీయమైన మొక్కలు నాటారు.