మూడవ రోజు ఘనంగా శివ కళ్యాణ మహోత్సవాలు
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య మండప ఆరాధన, ఆవాహిత హోమం, ఔపాసనం, బలిహరణం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి సమయంలో సదస్యం, ఔపాసనం, బలిహరణం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.