రూ. 9.80 లక్షల విలువైన కిసాన్ డ్రోన్ల పంపిణీ

NTR: జగ్గయ్యపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గురువారం కిసాన్ డ్రోన్ పథకం క్రింద రూ.9,80,000 విలువ గల 7 రైతులకు డ్రోన్లను జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.