'వరల్డ్ యాంటీ డ్రగ్ డే.. విద్యార్థులకు అవగాహన

'వరల్డ్ యాంటీ డ్రగ్ డే.. విద్యార్థులకు అవగాహన

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని జార్జి ఫార్మసీ కళాశాల నందు జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు శుక్రవారం వరల్డ్ యాంటీ డ్రగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డి.ఎస్.పి బాలసుందర్రావు పాల్గొని మాట్లాడుతూ.. యువత డ్రగ్ తీసుకోవడం వల్ల శారీరక మానసిక రుగ్మతలతో జీవితం నాశనం చేసుకుంటున్నట్లు తెలిపారు.