అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించిన మంత్రి బీసీ

కర్నూలు: బనగానపల్లి పట్టణంలో అండర్ డ్రైనేజీ పనులను రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం పరిశీలించారు. అధునాతన టెక్నాలజీతో అండర్ డ్రైనేజీ పనులను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బనగానపల్లి ఈఓఆర్డీ సతీష్ కుమార్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.