VIDEO: 'పోలీసు కిష్టయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి'
HYD: తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతిని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించారు. ముదిరాజ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కిష్టయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ముదిరాజ్ విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. పోలీస్ కిష్టయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.