రాజాపేటలో ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ
BHNG: రాజాపేటలోని ఫర్టిలైజర్ దుకాణాలను మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా పలు రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా పాముకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తదనంతరం బొందుగుల రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు.