పెద్దపల్లిలో ఘనంగా హిందూ సమ్మేళనం

పెద్దపల్లిలో ఘనంగా హిందూ సమ్మేళనం

పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ మైదానంలో నిన్న రాత్రి హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూ సాంప్రదాయ పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి యువత, ప్రజలు భారీగా తరలివచ్చారు. కళాశాల మైదానం జనంతో నిండిపోయింది.