రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
ELR: గన్నవరం - నూజివీడు రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు (65) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుని ఒంటిపై బొల్లి మచ్చలు ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. జీఆర్‌పీ ఎస్సై దానం కేసు నమోదు చేసి, మృతుని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.