ఇంటర్‌లో ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్‌లో ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

KMR: బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన పూజ (18) అనే యువతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా పూజకు తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్ద చదువుకుంది. కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న పూజ నిన్న ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ కావడంతో ఇలా చేసుకుందన్నారు.