VIDEO: అస్తవ్యస్తంగా డ్రైనేజీ.. ఇబ్బందుల్లో స్థానికులు
SRPT: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రం వెలుగుపల్లి రోడ్డు సాకలి బాయ్ వీధిలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారయింది. గ్రామ అధికారులు సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికి నీరు దుర్వాసన వెదజల్లుతుందని అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు.