నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KNR: ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11గంటల వరకు జగిత్యాల 33/11 KV టౌన్ సబ్‌స్టేషన్ మెయింటనెన్స్ దృష్ట్యా పట్టణ పరధిలోని రాంబజార్, పురాణిపేట, LG రామ్ లాడ్జీ ఏరియా, అంగడి బజార్, యావర్ రోడ్డు, మార్కెట్ బ్యాక్ సైడ్ ఏరియా, కృష్ణనగర్, ఆరవిందనగర్, మార్కండేయ టెంపుల్ ఏరియాలో విద్యుత్ ఉండదని డివిజనల్ ఇంజనీర్ గంగారాం తెలిపారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.