చెట్టును ఢీకొన్న బైక్‌.. వ్యక్తి మృతి

చెట్టును ఢీకొన్న బైక్‌.. వ్యక్తి మృతి

KMR: చెట్టును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సుల్తాన్​నగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన ఘని(30) అనే వ్యక్తి పెట్రోల్​ విక్రయిస్తూ జీవిస్తున్నాడు. ఘని తన బైక్‌పై నిజాంసాగర్​లోని పెట్రోల్​ పంప్​కు వెళ్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొని మృతి చెందాడని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివ కుమార్ తెలిపారు.