ఈనెల 29 నుండి భద్రకాళి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు

WGL: శ్రీ భద్రకాళి దేవాలయంలో ఈ నెల 29 నుండి మే 10 వరకు శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో శేషు భారతి, చైర్మన్ శేషు, అధికారుల సమక్షంలో ఈరోజు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారి ప్రత్యేక అలంకరణలో దర్శనమివ్వనున్నారు.