వైద్య సేవలపై సమీక్షించిన మంత్రి సత్య కుమార్

అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలపై డాక్టర్లు, సిబ్బందితో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గురువారం సమీక్ష నిర్వహించారు. రోగులతో నేరుగా మాట్లాడి ఆరోగ్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఔట్ పేషంట్ సేవలను, ఆరోగ్య మిత్ర సేవల పనితీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు, మందుల లభ్యత గురించి వివరాలు తెలుసుకున్నారు.