శర్వానంద్ 'బైకర్' రిలీజ్ వాయిదా!
టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించిన మూవీ 'బైకర్'. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. డిసెంబర్ 5న 'అఖండ 2' విడుదల కానుంది. ఆ సినిమాకు భారీ హైప్ రావడంతో 'బైకర్'ను వాయిదా వేయాలని మేకర్స్ చూస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో మాళవికా నాయర్ కథానాయికగా నటించింది.